క్రికెట్లో ఇలాంటి కామెడీ వీడియో చూసి ఉండరు!

Fri,May 10, 2019 03:03 PM

Marcus Trescothick made quite a drama out of running between the wickets

లండన్: క్రికెట్ ఆటలో అనూహ్యంగా అప్పుడప్పుడూ సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. ఆ ఫన్నీ సన్నివేశాలు కాస్త మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారిని కడుపు ఉబ్బా నవ్వేలా చేస్తుంటాయి. ఇలాంటి కామెడీ సన్నివేశం ఒకటి ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్లో భాగంగా సోమర్‌సెట్, సర్రే మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగింది.

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ సోమర్‌సెట్ తరఫున ఆడుతున్నాడు. సర్రేతో మ్యాచ్‌లో సోమ‌ర్‌సెట్ కౌంటీ క్రికెట్ క్ల‌బ్ బ్యాట్స్‌మ‌న్‌ మిడ్‌వికెట్ దిశగా బంతిని బాదాడు. నాన్‌ైస్ట్రెకింగ్ ఎండ్‌లో ఉన్న మార్కస్ వికెట్ల మధ్య పరుగు తీసే క్రమంలో క్రీజులో బ్యాట్ పెట్టేటప్పుడు అదుపు తప్పి కిందపడిపోయాడు. అలాగే రెండో పరుగు కోసం ప్రయత్నించి మరోసారి క్రీజులో జారి పడ్డాడు. షాట్ ఆడిన బ్యాట్స్‌మన్ మరో రన్ కోసం సగం దూరం వరకు వెళ్లినప్పటికీ మార్కస్ పరుగుకు నిరాకరించడంతో రెండే పరుగులు వచ్చాయి. పరుగుతీసే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి ఇబ్బందిపడిన ఆ వీడియోను ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సోషల్ మీడియాలో షేరు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 43ఏండ్ల ట్రెస్కోథిక్ 1993లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ తరఫున 76 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.


3651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles