రిటైర్మెంట్‌ ప్ర‌క‌టించిన బ్యాడ్మింట‌న్ స్టార్

Thu,June 13, 2019 11:09 AM

హైద‌రాబాద్‌: బ్యాడ్మింట‌న్‌ స్టార్ ప్లేయ‌ర్, మాజీ నెంబ‌ర్ వ‌న్, మ‌లేషియాకు చెందిన లీ చాంగ్ వూ.. ఇవాళ రిటైర్మెంట్‌ను ప్ర‌క‌టించాడు. ఎంతో భావోద్వేగానికి గురైన అత‌ను ఈ విష‌యాన్ని మీడియా ముందు వెల్ల‌డించాడు. 19 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌కు ముగింపు ప‌లుకుతున్న‌ట్లు క‌న్నీటీ ధారల మ‌ధ్య త‌న రిటైర్మెంట్‌ను వెల్ల‌డించాడు. 36 ఏళ్ల మేటి బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ లీ చాంగ్.. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. వైద్యుల‌ను ఇటీవ‌ల క‌లిసిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అత‌ను చెప్పాడు. ఈ సంద‌ర్భంగా మ‌లేషియా ప్ర‌జ‌ల‌కు లీ థ్యాంక్స్ తెలిపాడు. ముక్కుకు సంబంధించిన క్యాన్స‌ర్‌తో లీ బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌త ఏడాది జూలైలో తేలింది. వ‌రుస‌గా మూడు ఒలింపిక్స్‌లో లీ చాంగ్ సిల్వ‌ర్ మెడ‌ల్స్ సాధించాడు. బీజింగ్‌, లండ‌న్‌, రియోలో అత‌ను సింగిల్స్‌లో ర‌జ‌త ప‌త‌కాలు గెలుచుకున్నాడు. ఆ త‌ర్వాత మూడు ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్స్‌లోనూ ఫైన‌ల్స్‌కు చేరుకున్నాడు. లండ‌న్‌, గాంగ్‌జూ, జ‌కర్తాలో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఈవెంట్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. చైనీస్ సూప‌ర్ స్టార్ లిన్ డాన్ చేతిలోనే అత‌ను నాలుగుసార్లు ఓడిపోవాల్సి వ‌చ్చింది.1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles