కుంబ్లేకు, ర‌విశాస్త్రికి అదే తేడా!

Wed,June 28, 2017 12:41 PM

ఆంటిగ్వా: టీమిండియా కోచ్ ప‌ద‌వికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయ‌డం.. తాజాగా ఆ ప‌ద‌వికి తాను ద‌ర‌ఖాస్తు చేసుకుంటానని టీమ్ మాజీ డైరెక్ట‌ర్ ర‌విశాస్త్రి చెప్ప‌డంతో ఇక అత‌నే కోచ్ అని చాలా మంది ఫిక్స‌య్యారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం టీమ్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న ఆర్ శ్రీధ‌ర్‌.. ఇద్ద‌రి కోచింగ్ స్టైల్స్‌లో ఉన్న తేడాల‌ను చెప్పాడు. మూడేళ్లుగా విరాట్ సేన‌తో క‌లిసుంటున్న శ్రీధ‌ర్‌కు.. ఇద్ద‌రి కోచింగ్ స్టైల్స్‌ను ద‌గ్గ‌రుండి చూసిన అనుభ‌వం ఉంది. తేడాలు చెప్ప‌డ‌మే కాదు.. ఇప్పుడున్న టీమ్‌కు ఎవ‌రు సూట‌వుతారో కూడా అత‌ను తెలిపాడు. ఓ మ‌నిషి క్యారెక్టర్‌ను చూసే వ్య‌క్తి ర‌విశాస్త్రి. టీమ్‌లో అలాంటి వాళ్లే ఉండాల‌ని అనుకుంటాడు. అత‌ను అలాగే ప‌నిచేశాడు. అదే కుంబ్లే మాత్రం త‌న‌దైన స్టైల్లో టీమ్ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని చూస్తాడు అని శ్రీధ‌ర్ వెల్ల‌డించాడు. ఇద్ద‌రికీ అస‌లు పోలిక‌లు లేవు.. ఎవ‌రి స్టైల్ వారితే అని అత‌ను చెప్పాడు.


శ్రీధ‌ర్ మాట‌ల‌ను బట్టి చూస్తే.. కెప్టెన్‌, టీమ్ ఏం చెబితే అది కుంబ్లే చేసి ఉంటే బాగుండేది అన్న అర్థం ధ్వ‌నించింది. ఈ రోజుల్లో ఓ లీడ‌ర్ త‌న టీమ్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి ముందుకు వెళ్లాలి. మార్పును స్వీక‌రించేలా ఉండాలి. టీమ్ డిమాండ్స్‌కు త‌గిన‌ట్లు వ్య‌వ‌హ‌రించి.. ప్ర‌తి ఒక్క‌రి నుంచి వాళ్ల పూర్తి శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను రాబ‌ట్టాలి అని శ్రీధ‌ర్ అన్నాడు. మంచి లీడ‌ర్ కావాలంటే మంచి ఫాలోవ‌ర్‌గా ఉండాలి. ఇప్పుడున్న టీమ్‌కు చాలా అనుభ‌వం ఉంది. దానిని గౌర‌వించి వాళ్ల‌తో క‌లిసి న‌డ‌వాలి, టీమ్‌కు ఉప‌యోగ‌ప‌డే మంచి నిర్ణయాలు తీసుకోవాల‌ని శ్రీధ‌ర్ చెప్పాడు.

మ‌రి ఇప్పుడున్న టీమ్ ర‌విశాస్త్రి కోచ్‌గా ఉంటే హ్యాపీగా ఉంటుందా లేక కుంబ్లేతోనా అన్న ప్ర‌శ్న‌కు అత‌ను స‌మాధానం దాట‌వేశాడు. విరాట్‌, అత‌ని టీమ్ అవ‌న్నీ ప‌ట్టించుకోద‌ని, మ్యాచ్ ప్రిప‌రేష‌న్స్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పాడు. వాళ్లంతా ప్రొఫెష‌న‌ల్స్‌. టీమ్‌కు ఏది అవ‌స‌ర‌మో అదే చేస్తారు. ఎవ‌రితో ఎలా ఉండాలి. కోచ్ నుంచి ఏం కావాలో వాళ్ల‌కు తెలుసు అని శ్రీధ‌ర్ అన్నాడు. మొత్తానికి అత‌ని మాట‌ల‌ను బట్టి చూస్తే కుంబ్లేతో టీమ్‌కు అస్స‌లు పొస‌గ‌లేద‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.

3632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles