భారీ హిట్టింగ్‌.. హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వీడియో

Tue,June 18, 2019 11:24 AM

Linton Das hits hat trick sixers against West Indies

హైద‌రాబాద్‌: వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద‌ర‌గొట్టింది. విండీస్ విసిరిన 322 ప‌రుగుల భారీ టార్గెట్‌ను బంగ్లా టైగ‌ర్‌లు ఈజీగా చేజ్ చేశారు. టాంట‌న్ మైదానంలో సోమ‌వారం సిక్స‌ర్ల జ‌డివాన కురిసింది. విండీస్‌తో పాటు బంగ్లా బ్యాట్స్‌మెన్ కూడా భారీ షాట్ల‌తో అల‌రించారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో నికోల‌స్ పూర‌న్ కొట్టిన ఓ సిక్స‌ర్‌.. స్టాండ్స్ పైక‌ప్పుకు త‌గిలి.. వాటిపై ఉన్న ఓ పెంక కూడా ప‌గిలింది. మ‌రో హిట్ట‌ర్ హిట్‌మేయ‌ర్ కూడా భారీ సిక్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక విండీస్ కెప్టెన్ హోల్డ‌ర్ కూడా చాలా ఈజీగా ఓ భారీ సిక్స‌ర్‌ను బాదేశాడు. అయితే చేజింగ్‌లో బంగ్లా ప్లేయ‌ర్ లింట‌న్ దాస్ దుమ్మురేపాడు. షార్ట్ పిచ్ బంతుల‌ను సిక్స‌ర్లుగా మలిచాడు. గ్యాబ్రియ‌ల్ వేసిన బౌలింగ్‌లో.. హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో అల‌రించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 సిక్స‌ర్లను కొట్టారు. ఇదిగో వీడియో.



5482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles