అదీ ఆటంటే.. కోహ్లిని చూసి నేర్చుకోండి!

Tue,August 21, 2018 10:49 AM

Learn from Virat Kohli England Assistant Coach Paul Farbrace tells his players

నాటింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తాను వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి టీమ్‌ను విజయం ముంగిట నిలిపాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అతడు 97 పరుగులు చేసిన విషయం తెలిసిందే. నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో రహానేతో అతను నెలకొల్పిన భాగస్వామ్యమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ టీమ్ అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్‌బ్రేస్ కూడా అతన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. కోహ్లిని చూసి నేర్చుకోండి అంటూ తమ బ్యాట్స్‌మెన్‌కు సూచించాడు. స్వింగ్‌కు అనుకూలించే కండిషన్స్‌లో తన అద్భుతమైన టెక్నిక్‌తో విరాట్ మరోసారి ఓ చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్‌లో కోహ్లి ఆడిన తీరు అద్భుతమని ఫార్‌బ్రేస్ అన్నాడు.

ఎవరైనా క్రికెట్‌ను అలా ఆడుతుంటే చూడటం చాలా బాగుంటుంది. కోహ్లి అత్యుత్తమ ప్లేయర్. ఈ టూర్ నుంచి అతడు చాలా నేర్చుకున్నాడు అని ఫార్‌బ్రేస్ కొనియాడాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఫీల్డర్లు క్యాచ్‌లు డ్రాప్ చేయడం కోహ్లికి కలిసి వచ్చింది. 21, 51,93 పరుగుల వ్యక్తిగత స్కోర్ల దగ్గర క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో విరాట్ సెంచరీ చేయగలిగాడు. అయితే వీటిని తమ బౌలర్లు సాకుగా చూపలేరని కూడా ఫార్‌బ్రేస్ స్పష్టంచేశాడు. ప్లేయర్స్‌ను చూసి ప్లేయర్స్ నేర్చుకుంటారని నేను నమ్ముతాను. మా ప్లేయర్స్ కూడా కోహ్లి ఎలా ఆడుతున్నాడో చూడాలి. అతని ఆటను తమకు సూటయ్యేలా మలుచుకొని ఆడాలి అని ఫార్‌బ్రేస్ తమ ప్లేయర్స్‌కు సూచించాడు.

3755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles