క్రొయేషియాను చూసి నేర్చుకోండి.. ఇండియన్స్‌కు భజ్జీ క్లాస్!

Mon,July 16, 2018 03:06 PM

Learn from Croatia Harbhajan Singh message to Indians

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విటర్‌లో భారతీయులకు క్లాస్ పీకాడు. దేశంలో అక్కడక్కడా హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న అల్లర్లపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఈ అంశాన్ని ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ ఆడిన క్రొయేషియా టీమ్‌ను ఉదాహరణగా తీసుకొని చెప్పాడు. 50 లక్షల జనాభా కూడా లేని క్రొయేషియా వరల్డ్‌కప్ ఫైనల్ ఆడుతున్నది.. మనం 135 కోట్ల మంది ఇండియన్స్ హిందూ, ముస్లిం ఆట ఆడుతున్నాం.. ముందు ఆలోచన మార్చుకోండి.. దేశం మారుతుంది అంటూ భజ్జీ ట్వీట్ చేశాడు. సోచ్ బద్‌లో దేశ్ బద్‌లేగా హ్యాష్‌ట్యాగ్‌ను హర్భజన్‌సింగ్ ఈ ట్వీట్‌లో పోస్ట్ చేశాడు.


ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రొయేషియా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆ టీమ్ ఇంత వరకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫైనల్లోనూ ఫ్రాన్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఓ ఓన్ గోల్ ఫైనల్లో వాళ్ల కొంప ముంచినా.. ఓవరాల్‌గా క్రొయేషియా ఆట అదుర్స్ అనిపించే ఉంది.

3446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles