ఐపీఎల్-2019 సీజన్ ఆటగాళ్ల వేలం విశేషాలు..!

Mon,December 17, 2018 03:36 PM

latest live updates of IPL 2019 auction

న్యూఢిల్లీ: మొత్తం 346 మంది క్రికెటర్లు.. అందులో 226 మంది ఆటగాళ్లు భారతీయులే. వీరంతా అట్టహాసంగా జరిగే ఐపీఎల్-12 వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జైపూర్‌లో మంగళవారం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1003 మంది ప్లేయర్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, ఎనిమిది ఫ్రాంఛైజీలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఆటగాళ్ల ఫైనల్ లిస్టును తయారు చేశారు. ఎంపిక చేసిన ఆటగాళ్లను మాత్రమే వేలం వేయనున్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రేపు మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి ఆయా ఫ్రాంఛైజీలు పోటీపడనున్నాయి. జట్టును గెలిపిస్తాడనుకున్న క్రికెటర్ల కోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి జట్ల యాజమాన్యాలు అసలు వెన‌క్కి త‌గ్గ‌వు.

118 మంది జాతీయ జట్లకు ఆడిన క్రికెట‌ర్లు, 228 మంది దేశవాళీ ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. మొత్తం 8 జట్లకు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అత్యధిక కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో భారత ఆటగాడు ఒక్కరు కూడా లేరు.

విదేశీ టీ20 స్పెష‌లిస్టులు మెక్‌కలమ్‌, క్రిస్‌ వోక్స్‌, మలింగ, షాన్‌ మార్ష్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, కోరె అండర్సన్‌, ఏంజెలో మాథ్యూస్‌, సామ్‌ కరన్‌, షార్ట్‌ తమ కనీస ధరను రూ.2 కోట్ల‌తో వేలంలో పాల్గొన‌బోతున్నారు. బౌల‌ర్ ఇషాంత్‌ శర్మ, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ నమన్‌ ఓజా కనీస ధర రూ.75 లక్షలు కాగా.. టెస్టు స్పెష‌లిస్ట్‌ పుజారా, మనోజ్‌ తివారి, హనుమ విహారి, గుర్‌కీరత్‌ సింగ్‌, మోహిత్‌ శర్మ కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వ‌స్తున్నారు.

3133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles