మలింగ ఇంట విషాదం.. బంగ్లాతో మ్యాచ్ తర్వాత స్వదేశానికి

Tue,June 11, 2019 02:47 PM

Lasith Malinga to Fly Back Home to Attend Mother-in-laws Funeral

బ్రిస్టల్: శ్రీలంక సీనియర్ పేసర్ లసిత్ మలింగ ఇంట విషాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోన్న మలింగకు తన అత్త మరణవార్త తెలిసింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరు తర్వాత మలింగ స్వదేశానికి బయలుదేరి వెళ్లనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. మలింగ అత్త కాంతీ పెరీరా అంత్యక్రియలను గురువారం కొలంబోలో నిర్వహించనున్నారు. జూన్ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు అతడు జట్టుతో కలిసే అవకాశం ఉందని బోర్డు వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన లంక అప్గనిస్థాన్‌పై మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. నేడు బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

8216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles