కోచ్‌గా మేం ప‌నికిరామా?

Fri,June 23, 2017 01:25 PM

Lalchand Rajput upset over BCCI inviting fresh Applications for Coach post

న్యూఢిల్లీ: బీసీసీఐపై తీవ్రంగా మండిప‌డ్డాడు కోచ్ ప‌ద‌వి కోసం ద‌రఖాస్తు చేసుకున్న వారిలో ఒక‌రైన లాల్‌చంద్ రాజ్‌పుత్‌. కుంబ్లే రాజీనామా చేయ‌డంతో కోచ్ ప‌ద‌వికి మ‌రిన్ని ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డాన్ని అత‌ను త‌ప్పుబ‌ట్టాడు. ఇప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఐదుగురు వ్య‌క్తులు ప‌నికిరారా? వాళ్ల‌పై న‌మ్మ‌కం లేదా? కుంబ్లే వెళ్ల‌గానే కొత్త ద‌ర‌ఖాస్తులు ఎందుకు ఆహ్వానించారు అని రాజ్‌పుత్ ప్ర‌శ్నించారు. కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో సెహ్వాగ్‌, మూడీ, రిచ‌ర్డ్ పైబ‌స్‌, దొడ్డ గ‌ణేష్‌తోపాటు లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. కొత్త ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డం మ‌మ్మ‌ల్ని అవ‌మానించ‌డ‌మే అని లాల్‌చంద్ స్ప‌ష్టంచేశాడు. ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం కాదు ముందు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిని గౌర‌వించ‌డం నేర్చుకోండి అంటూ బీసీసీఐకి చుర‌క‌లంటించాడత‌డు. ఆఫ్ఘ‌నిస్థాన్ టీమ్‌కు కోచ్‌గా ఉన్న లాల్‌చంద్ రాజ్‌పుత్ ఏడాది కాలంలో అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించిపెట్టాడు. రీసెంట్‌గా ఆ టీమ్‌కు టెస్ట్ స్టేట‌స్ కూడా వ‌చ్చింది.

ఇక కోచ్ కావ‌డానికి గొప్ప ప్లేయ‌ర్ అయి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా రాజ్‌పుత్ వాదిస్తున్నాడు. ఇంగ్లండ్ టీమ్‌తో ట్రెవ‌ర్ బేలిస్‌, సౌతాఫ్రికా టీమ్‌తో ర‌సెల్ డోమింగో చేసిన అద్భుతాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అత‌ను చెప్పాడు. గొప్ప ప్లేయ‌ర్ అయినంత మాత్రాన కోచ్‌గా స‌క్సెస్ అవుతాడ‌న్న గ్యారెంటీ ఏమీ లేద‌ని రాజ్‌పుత్ స్ప‌ష్టంచేశాడు. అంతేకాదు తాను కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో ఇండియ‌న్ టీమ్ 2007లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్‌, పాకిస్థాన్‌పై విజ‌యాలు గుర్తుంచుకోవాల‌ని లాల్‌చంద్ చెప్పాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలో త‌న‌ను చాలా మంది టీమ్ మేనేజ‌ర్ అనుకున్నార‌ని, కానీ ఆ స‌మ‌యంలో సునీల్ దేవ్ మేనేజ‌ర్ కాగా.. తాను కోచ్‌న‌ని అత‌ను తెలిపాడు. కుంబ్లే కేవ‌లం ఇండియాలో స‌క్సెస్ అయ్యాడేమో కానీ.. త‌న కోచింగ్‌లో ఇండియ‌న్ టీమ్‌ విదేశాల్లోనూ రాణించింద‌ని గుర్తుచేశాడు.

4715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles