సింధు.. నిన్ను చూసి గర్వపడుతున్నాం: కేటీఆర్

Sun,December 16, 2018 04:17 PM

ktr congratulate PV Sindhu on Twitter

హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేత పీవీ సింధుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించిన సింధుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. 'నిన్ను చూసి గర్వపడుతున్నాం' అని కేటీఆర్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. మరోవైపు టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా శుభాకాంక్షలు తెలిపారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో జపాన్ బ్యాడ్మింట‌న్ స్టార్‌ నొజొమి ఒకుహరను 21-19, 21-17తో ఓడించి సింధు విజేతగా నిలిచింది.

3309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles