ఐపీఎల్ కాంట్రాక్ట్ ర‌ద్దు విషయాన్ని టెక్ట్స్‌ మెసేజ్‌ చేశారు!

Wed,November 14, 2018 01:10 PM

Kolkata Knight Riders End Mitchell Starc's Contract Via Text Message

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 కోసం ప్రాంఛైజీలు తమ జట్ల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను వదులుకుంది. ఈ విషయాన్ని స్టార్క్ మీడియాతో వెల్లడించాడు. కోల్‌కతా ఫ్రాంఛైజీ యాజమాన్యం నుంచి రెండు రోజుల క్రితం ఒక టెక్ట్స్‌ మెసేజ్‌ వచ్చిందని.. ఆ ఫ్రాంఛైజీ తనను జట్టు నుంచి విడుదల చేసినట్లు అందులో పేర్కొంది. దీంతో వచ్చే ఏప్రిల్‌లో ఇక తాను స్వదేశంలోనే ఉంటానని సిడ్నీలో విలేకరుల సమావేశంలో స్టార్క్ తెలిపాడు. 2018 ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రూ.9.4కోట్లు వెచ్చించి స్టార్క్‌ను కోల్‌కతా దక్కించుకుంది.

ఐతే కాలి గాయం కారణంగా స్టార్క్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సీనియర్ బౌలర్ సేవలను కోల్‌కతా కోల్పోయింది. అప్పటి నుంచి గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ స్టార్క్ ఇటీవల జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. వచ్చే సీజన్ కోసం అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు గురువారమే ఆఖరి రోజు కావడంతో ఆయా ఫ్రాంఛైజీలు తుదిజాబితాను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి.

2240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles