విరాట్‌ మెరుపు సెంచ‌రీ.. బెంగళూరు స్కోరు 213

Fri,April 19, 2019 09:52 PM

Kohli Slams Ton, Takes RCB to 213

కోల్‌కతా: ఐపీఎల్‌-12వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ తొలిసారి అదిరిపోయే ప్రదర్శన చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(100: 58 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు శతకంతో ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. విరాట్‌తో పాటు మొయిన్‌ అలీ(66: 28 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) విజృంభించడంతో 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. విరాట్‌, మొయిన్‌ అలీ జోడీ కోల్‌కతా బౌలర్లను ఉతికారేసింది. బంతి ఎక్కడ, ఎటువైపు వేయాలో అర్థం కాక బౌలర్లు ఇబ్బంది పడ్డారు. బౌండరీ బాదడమే లక్ష్యంగా వారిద్దరి విధ్వంసం సాగింది. ముఖ్యంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 16వ ఓవర్లో అలీ చితక్కొట్టాడు. ఆ ఓవర్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది ఏకంగా 27 పరుగులు రాబట్టడంతో బెంగళూరు స్కోరు జెట్‌ వేగంతో దూసుకెళ్లింది. అదే ఓవర్‌ ఆఖరి బంతికి అలీ ఔటైనా స్కోరు వేగం తగ్గలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినీస్‌(17: 8 బంతుల్లో)తో కలిసి విరాట్‌ స్కోరును 200 పరుగుల మార్క్‌ను దాటించాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లోనే కోహ్లీ ఐపీఎల్‌లో మరో సెంచరీని తనపేరిట లిఖించుకున్నాడు. కోల్‌కతా సొంతగడ్డ ఈడెన్‌ గార్డెన్స్‌లో విరాట్‌ దూకుడును ఏ బౌలర్‌ అడ్డుకోకపోయారు. అందరూ ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. గుర్నీ, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రస్సెల్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. బెంగళూరు ఓపెనర్‌ పార్థీవ్‌ పటేల్‌(11) మరోసారి విఫలం కాగా అక్షదీప్‌ నాథ్‌(13) నిరాశపరిచాడు.4382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles