కోహ్లీ, రవిశాస్త్రిలకు గౌరవ జీవితకాల సభ్యత్వం

Fri,January 11, 2019 06:55 PM

Kohli, Shastri honoured in Australia, given SCG membership

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలకు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌కు వారిద్దరూ చేస్తున్న విశేష సేవలకు గుర్తింపునకు గాను ప్రతిష్ఠాత్మక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ) గౌరవ జీవితకాల సభ్యత్వం ఇచ్చింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ఎస్‌సీజీ అభినందనలు తెలిపింది. సభ్యత్వానికి సంబంధించిన అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు. ప్రపంచంలో గొప్ప మైదానాల్లో ఎస్‌సీజీ ఒకటి. ఇందులో ఇప్పటి వరకు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా(వెస్టిండీస్)లు మాత్రమే గౌరవ సభ్యత్వం పొందారు.

టెస్టు క్రికెటకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యంపై ఎస్‌సీజీ ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయంగా టెస్టు క్రికెట్‌ను బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్న తీరు అభినందనీయమని ఎస్‌సీజీ ఛైర్మన్ టోనీ షెప‌ర్డ్‌ వ్యాఖ్యానించారు. అవార్డులను అందుకోవడం పట్ల కోహ్లీ, శాస్త్రి సోషల్‌మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.4173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles