దురదృష్టం అంటే ఇదే.. 13 మ్యాచ్‌ల్లో 10సార్లు టాస్ ఓడిన కోహ్లీ

Wed,May 1, 2019 10:56 AM

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కాయిన్ టాస్ కలిసిరావట్లేదు. ఐపీఎల్-12లో మొత్తం 13 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాడు. దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యర్థి జట్లకు టాస్ ఎంచుకునే అవకాశం దొరికింది. అది ఆర్‌సీబీ గెలుపోటములపై కూడా ప్రభావం చూపించింది. తాజాగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విరాట్ టాస్ ఓడిన విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడం కోహ్లీకిది వరుసగా ఆరోసారి కావడం విశేషం. టాస్ విషయమై కోహ్లీ మాట్లాడుతూ.. కాయిన్ టాస్ గురించి చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ ప్రయత్నాలు కూడా ఎక్కడా ఫలించట్లేదు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 10 టాస్‌లు ఓడిపోయాను అని రన్ మెషీన్ పేర్కొన్నాడు.


ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో టాస్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వైపు విరాట్ తొమ్మిదివేళ్లను చూపించాడు. దాని అర్థం తొమ్మిదోసారి కూడా మనం టాస్ గెలవలేదని సంజ్ఞ చేయడంతో అందరూ నవ్వుకున్నారు. భారత జట్టుకు కెప్టెన్‌గానూ కోహ్లీకి ఈ ఏడాది టాస్ కలిసిరావట్లేదు. 2019లో అన్ని ఫార్మాట్లలో కలిపి 14 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన విరాట్ కేవలం ఐదింటిలోనే మాత్రమే టాస్ నెగ్గడం విశేషం.3111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles