కోహ్లి ఉత్తమ బ్యాట్స్‌మన్ కానీ స్మిత్ అత్యుత్తమం: ఆసీస్ కోచ్

Mon,September 9, 2019 01:52 PM

Kohli is the best batsman but Smith is the best: Aussies coach

ఓల్డ్ ట్రాఫోర్డ్: ప్రస్తుత టెస్టు క్రికెట్‌లో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఉత్తమ ఆటగాడనీ, కానీ ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్ అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం బ్యాట్స్‌మన్ స్మిత్ అని ఆయన నొక్కి చెప్పాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో 12 నెలలు క్రికెట్‌కు దూరమైన స్మిత్ నిషేదానంతరం ఆడుతున్న తొలి టెస్టు సిరీస్‌లో అదరగొడుతున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 671 పరుగులు చేసిన స్మిత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లిని వెనక్కి నెట్టి టాప్‌లోకి దూసుకెళ్లాడు. ఈ సిరీస్‌లో స్మిత్ ఓ డబుల్ సెంచరీ సహా, రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

1048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles