రషీద్ మ్యాజిక్ బంతికి.. కోహ్లీ ఇలా క్లీన్ బౌల్డ్: వీడియో

Tue,July 17, 2018 07:59 PM

Kohli cant believe it An incredible delivery

లీడ్స్: ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(71: 72 బంతుల్లో 8ఫోర్లు) అనూహ్యంగా ఔటయ్యాడు. ఆతిథ్య స్పిన్నర్ రషీద్ బౌలింగ్‌లో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. 31వ ఓవర్ తొలి బంతిని విరాట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి ఎక్కువ‌గా టర్న్ కావడంతో అదికాస్త బ్యాట్‌ను తాకకుండా నేరుగా వెళ్లి ఆఫ్‌స్టంప్ వికెట్‌ను తాకింది. క్షణాల వ్యవధిలో ఊహించని షాక్ తగలడంతో ఆశ్చర్యానికి గురైన విరాట్ కొద్దిసేపు క్రీజులోనే ఉండి నిరాశగా మైదానాన్ని వీడాడు. రోహిత్ శర్మ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ ఇంగ్లీష్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు సాధించాడు. అర్ధశతకం సాధించి మంచి జోరుమీదున్న కెప్టెన్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. రషీద్ అద్భుత బంతికి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. 42 ఓవర్లకు భారత్ 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.4197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles