శ్రీలంక ట్రై సిరీస్‌కు కోహ్లి, ధోనిల‌కు రెస్ట్‌.. కెప్టెన్‌గా రోహిత్‌

Sun,February 25, 2018 01:04 PM

Kohli and Dhoni rested for Sri Lanka Tri Series Rohit to lead the team

ముంబైః శ్రీలంక‌లో జ‌రిగే టీ20 ట్రై సిరీస్ కోసం టీమిండియాను ప్ర‌క‌టించింది సెలక్ష‌న్ క‌మిటీ. ఊహించిన‌ట్లే విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చారు. అయితే మాజీ కెప్టెన్ ధోనీకి కూడా సెల‌క్ట‌ర్లు విశ్రాంతినివ్వ‌డం విశేషం. ఈ ఇద్ద‌రితోపాటు భువ‌నేశ్వ‌ర్‌, పాండ్యా, కుల్‌దీప్‌, బుమ్రాల‌కు కూడా విశ్రాంతినిచ్చారు. సుదీర్ఘ సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌తో అలసిపోయిన ఈ స్టార్లంద‌రికీ కాస్త సేద దీరే అవ‌కాశం ద‌క్కింది. ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇక శిఖ‌ర్ ధావ‌న్‌ను తొలిసారి వైస్ కెప్టెన్‌గా ప్ర‌క‌టించారు. దీప‌క్ హుడా, రిష‌బ్ పంత్‌ల‌కు సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. విజ‌య్ శంక‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లాంటి యువకుల‌కు కూడా చోటు ద‌క్కింది. ప్ర‌ధాన వికెట్ కీప‌ర్‌గా దినేష్ కార్తీక్ ఉండ‌నున్నాడు. మార్చి 6 నుంచి శ్రీలంక‌లో ఈ ట్రైసిరీస్ మొద‌లవుతుంది. ఇండియా, శ్రీలంక‌తోపాటు బంగ్లాదేశ్ మూడో టీమ్‌గా ఉంది. మార్చి 18న సిరీస్ ముగుస్తుంది.

శ్రీలంక ట్రై సిరీస్‌కు టీమిండియాః రోహిత్ (కెప్టెన్‌), శిఖ‌ర్ ధావ‌న్ (వైస్ కెప్టెన్‌), రాహుల్‌, రైనా, మ‌నీష్ పాండే, దినేష్ కార్తీక్‌, దీప‌క్ హుడా, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, విజ‌య్ శంక‌ర్‌, శార్దూల్ ఠాకూర్‌, జైదేవ్ ఉన‌ద్క‌ట్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, రిష‌బ్ పంత్‌

3082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles