రాహుల్ రికార్డును సమం చేసిన రాహుల్

Sun,September 9, 2018 11:29 AM

KL Rahul equals Rahul Dravids 13-year-old record

లండన్: ఓవల్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. దిగ్గజ క్రికెటర్, ప్రపంచ అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్లలో ఒకడిగా పేరొందిన రాహుల్ ద్రవిడ్ 13ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును తాజాగా కేఎల్ రాహుల్ సమం చేశాడు. ఐదో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ క్యాచ్ అందుకోవడం ద్వారా రాహుల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ రికార్డును రాహుల్ సమం చేసి ఆకట్టుకున్నాడు.

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రాహుల్ ఇప్పటి వరకు 13 క్యాచ్‌లను అందుకోవడం విశేషం. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉన్నందున.. ఒక సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లను అందుకున్న భారత క్రికెటర్‌గా నిలిచే అరుదైన అవకాశం రాహుల్ ముందటుంది. 2004-05 బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ద్రవిడ్(13క్యాచ్‌లు) ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఐదు టెస్టుల సిరీస్‌లో ఎక్కువ క్యాచ్‌లు(15) అందుకున్న రికార్డు ఆస్ట్రేలియా ప్లేయర్ జాక్ గ్రెగోరీ పేరుమీదుంది.

1560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS