ఘ‌నంగా యువ క్రికెటర్ నిశ్చితార్థం

Tue,June 12, 2018 10:29 AM

న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ క్రికెటర్ నితీష్ రాణా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు తన సన్నిహితులతో పాటు కుటుంబసభ్యులు హాజరయ్యారు. భారత క్రికెటర్లు సందీప్ శర్మ, మయాంక్ అగర్వాల్‌తో పాటు ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్ కూడా తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో నితీష్ రాణా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేకేఆర్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. వివాహ తేదీ వివరాలు త్వరలో వెల్లడిస్తానని నితీష్ పేర్కొన్నాడు.3119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles