ఉత్కంఠ పోరులో ఓడిన‌ భార‌త్‌..ఫైనల్‌కు కివీస్

Wed,July 10, 2019 07:33 PM

Kiwis Win by 18 Runs

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్‌పోరులో చేతులెత్తేసింది. న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీఫైన‌ల్లో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పోరాడి ఓడిన కోహ్లీసేన మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా(77: 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), మహేంద్రసింగ్ ధోనీ(50: 72 బంతుల్లో ఫోర్, సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ గెలుస్తుందని భావించారు.

ఐతే ఆఖర్లో ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు, బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీసి భారత్‌ను భారీ దెబ్బకొట్టారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1), దినేశ్ కార్తీక్(6) దారుణంగా విఫలమయ్యారు. వీరిలో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ నిలబడినా భారత్‌కు విజయావకాశాలు మెరుగ్గా ఉండేవి. టాపార్డర్ కుప్ప‌కూల‌డంతో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అనంతరం పాండ్య, పంత్‌లు కాస్త నిలదొక్కకున్నా ఇద్దరూ 32 పరుగుల వద్ద పెవిలియన్‌ దారి పట్టడంతో భారత్‌ ఫైనల్‌ ఆశలు ఆవిరియ్యాయి. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్య(32) కొంత‌సేపు పోరాడారు.

8318
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles