ఆఖ‌రిపోరాటం..చెన్నైపై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

Sun,May 5, 2019 03:43 PM

Kings XI Punjab win the toss and elect to field

మొహాలి: ఐపీఎల్‌-12సీజన్‌ లీగ్‌దశలో ఆఖరి మ్యాచ్‌ ఆడేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్ర అశ్విన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అక్షదీప్‌సింగ్‌ స్థానంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నట్లు ధోనీ చెప్పాడు. చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకోగా.. నాకౌట్‌ రేసు నుంచి పంజాబ్‌ నిష్క్రమించింది.

ఇప్పటికే చెన్నై, ముంబై, ఢిల్లీ మూడు టీమ్‌లు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోగా.. బెంగళూరు, రాజస్థాన్ అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించాయి. పంజాబ్‌కు ఏ మూలో ఆశలు మిణుకు మిణుకు మంటున్నా.. జోరు మీదున్న చెన్నైని 160 పరుగుల తేడాతో ఓడిస్తే గానీ దానికి చాన్స్ ఉండదు.1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles