కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యం 153 పరుగులు

Sun,May 6, 2018 10:15 PM

Kings XI Punjab target 153 runs

ఇండోర్: ఐపీఎల్‌లో ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు జాన్ బట్లర్-51(39 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), సంజూ శాంసన్-28( 2 ఫోర్లు, ఒక సిక్స్), శ్రేయన్ గోపాల్-24(మూడు ఫోర్లు) పరుగులు చేశారు. స్పిన్నర్ ఉర్ రెహ్మన్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయలక్ష్యం 153 పరుగులు.

805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles