ఐపీఎల్‌లో పంజాబ్ బోణీ

Tue,March 26, 2019 01:48 AM

Kings XI Punjab beat Rajasthan Royals Punjab by 14 runs

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2019లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బోణీ చేసింది. సోమవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 14 పరుగుల తేడాతో ఐపీఎల్ తొలి చాంపియన్ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ విజృంభించి ఆడాడు. అతనికి తోడుగా సర్ఫరాజ్‌ఖాన్ (46 నాటౌట్) కూడా రాణించడంతో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అటు బౌలింగ్‌లోనూ సత్తాచాటి రాజస్థాన్ రాయల్స్‌ను సమర్ధవంతంగా ప్రతిఘటించింది. పరుగుల వేటలో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కొంతమేరకు సఫలీకృతమైనప్పటికీ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైన రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు.

2588
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles