పంజాబ్ పంచ్

Mon,April 16, 2018 12:58 AM

-చెన్నైపై 4 పరుగుల తేడాతో గెలుపు..
-ధోనీ పోరాటం వృథా

మొహాలీ: చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్రేక్ వేసింది. చెన్నైపై 4 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ ధోనీ ( 44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ) ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. రాయుడు (49) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో ఆండ్రూ టై 2 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచిన చెన్నై..పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమైన క్రిస్‌గేల్(63) ఓపెనర్‌గా వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్‌తో 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రాహుల్ (37)తో కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఆ తర్వాత యువీ (20) కాసేపు మెరిపించగా, ఫించ్ (0) మరో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. చెన్నై బౌలర్లలో ఠాకూర్, తాహీర్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

సంక్షిప్త స్కోర్లు: పంజాబ్: 20 ఓవర్లలో 197/7 (గేల్ 63, తాహీర్2/34) చెన్నై: 20 ఓవర్లలో 193/5 ( ధోనీ 79 నాటౌట్, టై 2/47)

3399
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles