మానిష్‌ పాండేకు శుభాకాంక్షలు తెలిపిన కింగ్‌ కోహ్లి..

Tue,December 3, 2019 06:17 PM

హైదరాబాద్‌: భారత క్రికెటర్‌ మానిష్‌ పాండేకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న మానిష్‌ పాండే వివాహం నటి అశ్రిత శెట్టితో ముంబయిలో ఘనంగా జరిగింది. పాండే వివాహం సందర్భంగా కోహ్లి తన ట్విట్టర్‌లో.. కంగ్రాట్యులేషన్‌ పాండేజీ. జీవితంలో మీ ఇద్దరూ సుఖ, సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపాడు. ఆ దేవుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నానని కోహ్లి తెలిపాడు.


పాండేకు సన్‌రైజర్‌ హైదరాబాద్‌ మరియు క్రికెటర్ల శుభాకాంక్షల వెల్లువ
మానిష్‌ పాండే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దేవుడు మీకు మంచి జరిగేలా చూడాలనీ, జీవితంలో సంతోషంగా, ప్రేమగా ఉండాలని ఐపీఎల్‌ యాజమాన్యం పాండేకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది.

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ.. జీవితంలో నూతన ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాండేకు శుభాకాంక్షలు అనీ, తన ట్విట్టర్‌లో తెలియజేశాడు. సురేష్‌ రైనా తన ట్విట్టర్‌లో మానిష్‌ పాండే.. శుభాకాంక్షలు. కొత్త జీవితం ప్రారంభిస్తున్న మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపాడు. నూతన ఇన్నింగ్స్‌కు స్వాగతం పాండేజీ అని ఉమేష్‌ ట్వీట్‌ చేశాడు. హర్భజన్‌ కూడా పాండేకు శుభాకాంక్షలు తెలిపాడు. మీ ఇద్దరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలనీ, జీవితంలో ఇద్దరు ప్రేమతో సాగాలని అతను ఆకాంక్షించాడు.
1670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles