కీర‌న్ పొలార్డ్‌కు జ‌రిమానా

Mon,May 13, 2019 12:20 PM

Kieron Pollard fined for showing dissent at umpires decision

హైద‌రాబాద్‌: ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ కీర‌న్ పొలార్డ్‌కు మ్యాచ్ ఫీజులో కోత‌ విధించారు. ఆదివారం ఉప్ప‌ల్ మైదానంలో చెన్నైతో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో పొలార్డ్‌కు 25 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. అంపైర్ల‌ నిర్ణ‌యంపై పొలార్డ్ అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం వ‌ల్ల అత‌నికి ఈ జ‌రిమానా ప‌డింది. బ్రావో వేసిన చివ‌రి ఓవ‌ర్‌లో స్ట్ర‌యికింగ్‌లో ఉన్న పోలార్డ్‌.. అంపైర్ల నిర్ణ‌యం ప‌ట్ల త‌న‌దైన స్ట‌యిల్లో నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. ఆ ఓవ‌ర్‌లో బ్రావో వ‌రుస‌గా రెండు బంతుల‌ను ఆఫ్‌సైడ్ వేశాడు. సైడ్‌లైన్ బ‌య‌ట బంతులు ప‌డినా ఫీల్డ్ అంపైర్ వాటిని వైడ్‌గా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో చిర్రెత్తిన పొలార్డ్ త‌న బ్యాట్‌ను గాలిలోకి విసిరేశాడు. ఆ త‌ర్వాత బ్రావో మ‌రో బంతి వేసేందుకు లైన‌ప్ తీసుకోగా.. పోలార్డ్ వికెట్ల‌ను వ‌దిలేసి చాలా దూరంగా స్ట్ర‌యికింగ్ తీసుకున్నాడు. దీంతో కాసేపు పొలార్డ్‌, ఫీల్డ్ అంపైర్ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ అజేయంగా 41 ర‌న్స్ చేశాడు. థ్రిల్లింగ్ ఫైన‌ల్‌ను ముంబై గెలుచుకున్న‌ది.5778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles