ఆస్ట్రేలియన్ ఓపెన్ : ఫైనల్లో కిర్బర్, సెరీనాతో ఢీ

Thu,January 28, 2016 11:57 AM

Kerber In Australian Open Final, To Clash With Serena

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ వుమెన్స్ ఫైనల్లోకి కిర్బర్ ప్రవేశించింది. రెండవ సెమీస్‌లో బ్రిటీష్ నెంబర్ వన్ ప్లేయర్ జొహన్నా కాంటాపై జర్మనీ ప్లేయర్ కిర్బర్ 7-5, 6-2 స్కోర్‌తో విజయం సాధించింది. దీంతో ఫైనల్లో సెరీనాతో కిర్బర్ ఫైట్ డిసైడ్ అయ్యింది. తొలి సెట్‌లో జొహన్నా కొంత ఆందోళనగా స్టార్ చేసింది. కిర్బర్ దూకుడుకు జొహన్నా అనవసర తప్పిదాలను అదుపు చేయలేకపోయింది. ఆమె ఈ మ్యాచ్‌లో 36 అనవసర తప్పిదాలు చేసింది. సుమారు గంటా 22 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో జొహన్నా అయిదు సార్లు సర్వ్‌ను కోల్పోయింది. గతంలో రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీస్ వరకు వెళ్లిన కిర్బర్ ఈ మ్యాచ్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

నెంబర్‌వన్ ప్లేయర్ సెరీనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ఈజీగా దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ సెరీనా మహిళల సింగిల్స్ తొలి సెమీస్ మ్యాచ్‌లో రద్వాన్‌స్కాపై కేవలం 64 నిమిషాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాడ్ లావర్ ఎరినా రూఫ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సెరీనా 6-0, 6-4 స్కోర్‌తో రద్వాన్‌స్కాపై సునాయాసంగా గెలుపొందింది. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకునేందుకు సెరీనా మరో అడుగు దూరంలో ఉంది. ఒకవేళ సెరీనా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంటే ఆమె గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల ఖాతా 22కు చేరుకుంటుంది.

నాలుగో సీడ్‌గా ఈ టోర్నీకి వచ్చిన 26 ఏళ్ల రద్వాన్‌స్కా గత ఎనిమిది మ్యాచుల్లో సెరీనా చేతిలో ఓటమి చవిచూసింది. సెమీస్‌లో జరిగిన తొలిసెట్‌లో సెరీనా పవర్ గేమ్‌కు రద్వాన్‌స్కా చేతులెత్తేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఆ సెట్‌ను సెరీనా సొంతం చేసుకుంది. 12 రిటర్న్ పాయింట్లను సాధించిన సెరీనా మొదటి సెట్‌లో పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండవ సెట్‌లో రద్వాన్‌స్కా కొంత పుంజుకున్నా.. సెరీనా ధాటికి నిలువలేకపోయింది.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles