క‌ళ్లుచెదిరే 'రిలే' క్యాచ్ త‌ప్ప‌క చూడాల్సిందే..

Sat,November 17, 2018 07:13 PM

Keaton Jennings stunning assist to dismiss Dimuth Karunar

కొలంబో: ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రతిరోజు కొన్ని అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, వికెట్ కీపర్, ఫీల్డర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ముఖ్యంగా మెరుపు స్టంపింగ్‌లు.. స్టన్నింగ్ క్యాచ్‌లు ఎక్కువగా అభిమానులను ఆకర్షిస్తుంటాయి. బ్యాట్స్‌మెన్ భారీ సిక్సర్లు మాత్రమే కాదు.. ఫీల్డర్ల అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు కూడా ఉంటాయి. రిలే క్యాచ్‌లు పట్టడం కొత్త కాకపోయినా ఈ క్యాచ్ మాత్రం కచ్చితంగా స్పెషలే.

కాండీలో శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కీటన్ జెన్నింగ్స్, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ రిలే క్యాచ్ పట్టారు. ఇంగ్లీష్ స్పిన్నర్ అదిల్ రషీద్ వేసిన బంతిని శ్రీలంక ఆటగాడు కరుణరత్నె స్వీప్ షాట్ ఆడగా.. షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జెన్నింగ్స్ బంతిని ఆపేందుకు మెరుపు వేగంతో స్పందించాడు. బంతి అతని చేతికి తాకి అక్కడే గాల్లోకి లేచింది. పక్కనే కీపింగ్ చేస్తున్న కీపర్ బెన్‌ఫోక్స్ అలవోకగా బంతిని అందుకోవడంతో కరుణరత్నె నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇదంతా కళ్లుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. దీంతో మైదానంలో మ్యాచ్‌ను చూస్తున్న వారితో పాటు ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు, టీవీ ప్రేక్షకులు అవాక్కయ్యారు.5420
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS