పాక్ విజ‌యం.. క‌శ్మీర్ మీడియాకూ పండ‌గే!Mon,June 19, 2017 01:06 PM

Kashmir Media highlights Pakistan win over India

శ్రీన‌గ‌ర్‌: క‌శ్మీర్ ప్ర‌జ‌లే కాదు అక్క‌డి మీడియా కూడా చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్‌పై పాకిస్థాన్ విజ‌యాన్ని పండుగ చేసుకుంది. ఇవాళ క‌శ్మీర్ ప‌త్రిక‌ల ఫ‌స్ట్ పేజీల్లో ఈ వార్తే ప్ర‌ధానంగా క‌నిపించింది. క‌శ్మీర్ సంతోషంతో చిందులేస్తుంది అని క‌శ్మీర్ రీడ‌ర్ అనే ప‌త్రిక తొలి పేజీలో వార్త‌ను ప్ర‌చురించింది. ఇప్ప‌టికే పాకిస్థాన్ విజ‌యాన్ని అటు వేర్పాటువాదులు, అక్క‌డి ప్ర‌జ‌లు ప‌టాకులు కాల్చి పండుగలా చేసుకున్న విష‌యం తెలిసిందే. కానీ మీడియా కూడా దీనిని అలాగే చూడటం గ‌మ‌నార్హం.

ఇండియాపై పాక్ గెలిచింది.. క‌శ్మీర్ సంతోషంతో ఊగింది అని గ్రేట‌ర్ క‌శ్మీర్ ప‌త్రిక తొలి పేజీలో రాసింది. పాక్ గెల‌వ‌డంతో ప‌టాకుల మోత మోగుతున్న‌ది అని రైజింగ్ క‌శ్మీర్ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌జ‌లు వీధుల్లో ర్యాలీలు నిర్వ‌హించారు.. పాక్ విజ‌యం సంద‌ర్భంగా స్వాతంత్ర్య అనుకూల నినాదాలు చేశారు అని క‌శ్మీర్ రీడ‌ర్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. పాక్ అనుకూల‌, ఇండియా వ్య‌తిరేక నినాదాలు ప్ర‌తి మ‌సీదు ద‌గ్గ‌రా వినిపించాయి.. చాలా చోట్ల పాక్ జాతీయ గీతం ఆల‌పించారు. శ్రీన‌గ‌ర్‌లో యూత్ ప‌టాకులు కాల్చారు.. అని ఆ ప‌త్రిక వెల్ల‌డించింది.

2217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS