విరాట్ కోహ్లీ.. కౌంటీ క్రికెట్ ఆడాలి: కపిల్ దేవ్

Wed,March 7, 2018 04:58 PM

Kapil Dev says India captain should play in Englands County Championship
లండన్: ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కచ్చితంగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో ఆడాలని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ప్ర‌స్తుతం కోహ్లీ టెస్టు సగటు 53.40(66 టెస్టుల్లో). చివరిసారిగా 2014 ఇంగ్లాండ్ టూర్‌లో పర్యటించినప్పుడు ఆ టెస్టు సిరీస్‌లో అతడి సగటు కేవలం 13.40(5టెస్టుల్లో) మాత్రమే. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలవాలనుకుంటే ప్రతిచోట పరుగులు సాధించాలని కపిల్ అభిప్రాయపడ్డారు. నిరంతర సాధన వ్యక్తిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతుంది. ప్రతిఒక్కరు అలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయాలని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యంత కష్టతరమైన పరిస్థితులుగా భావిస్తామో .. అక్కడ అతడు పరుగులు సాధించాలి. అక్కడికి వెళ్లి ఆడటాన్ని ప్రారంభిస్తే.. అది కచ్చితంగా ఎల్లప్పుడూ అతనికి ఉపయోగపడుతుందన్నారు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఒకటి గాని, రెండు సీజన్లు అతడు ఆడటం తప్పేంకాదని.. అక్కడ మెరుగ్గా రాణించేందుకు సాయపడుతుందన్నారు. 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన టీమిండియా 1-3తో ఇంగ్లీష్ జట్టు చేతిలో ఒటమిపాలైంది. వచ్చే ఆగస్టులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.

2313
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles