వరల్డ్‌కప్‌ ఫైనల్‌: న్యూజిలాండ్‌ ఫస్ట్‌ బ్యాటింగ్‌

Sun,July 14, 2019 02:55 PM

KaneWilliamson has won the toss and elected to bat first in the World Cup final at Lords

లండన్‌: క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో 12వ వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. తొలిసారి విశ్వవిజేతగా నిలిచేందుకు ఆతిథ్య ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ తుదిసమరంలో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అత్యంత కీలక మ్యాచ్‌లో రెండు జట్లు తాము సెమీఫైనల్లో ఆడిన తుది 11 మందితోనే ఫైనల్‌ బరిలో దిగాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో లార్డ్స్‌ మైదానంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలుపొందాయి.

44 ఏండ్లలో ఐదుసార్లు మెగాటోర్నీకి ఆతిథ్యమిచ్చినా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పును అక్కున చేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్.. క్రితంసారి తుదిమెట్టుపై బోల్తా కొట్టిన న్యూజిలాండ్.. రెండు జట్లూ ఈసారి ట్రోఫీని సొంతం చేసుకొని స‌రికొత్త ఛాంపియ‌న్‌గా ఆవిర్భ‌వించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి.


ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ఫ్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌

న్యూజిలాండ్‌: మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, జేమ్స్‌ నీషమ్‌, టామ్‌ లాథమ్‌, గ్రాండ్‌హోం, మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్డ్‌, ఫర్గుసన్‌


1387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles