అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విలియమ్సన్‌

Sun,July 14, 2019 04:51 PM

Kane Williamson now has more runs at  CWC19 than any other captain in a single World Cup campaign

లండన్‌: ఇంగ్లాండ్‌తో ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నిలకడగా ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌(19: 18 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) కీలక మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మరో ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మెరుగైనస్థితిలో నిలుపాలని ఈ జోడీ భావిస్తోంది. ఈ జంటను విడగొట్టేందుకు ఇంగ్లాండ్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. విలియమ్సన్‌ చాలా నెమ్మదిగా ఆడుతుండటంతో స్కోరు వేగం పెరగట్లేదు. ఆరంభంలో పేసర్లు క్రిస్‌వోక్స్‌, ఆర్చర్‌ పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. పిచ్‌ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని వికెట్లే లక్ష్యంగా బంతులు వేసి ఒత్తిడి పెంచారు. 20 ఓవర్లకు కివీస్‌ వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసింది. విలియమ్సన్‌(24), నికోల్స్‌(40) నిలకడగా రాణిస్తున్నారు.

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో విలియమ్సన్‌ ఇప్పటికే 557 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కేన్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. గతంలో శ్రీలంక సారథి మహేల జయవర్దనే(548, 2007లో) పరుగుల రికార్డును విలియమ్సన్‌ అధిగమించాడు.

2702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles