క్రికెట‌ర్ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌.. బౌల‌ర్‌పై ఐసీసీ వేటు

Sat,July 8, 2017 12:40 PM

Kagiso Rabada suspended from second Test for misconduct

ట్రెంట్‌బ్రిడ్జ్: సౌతాఫ్రికా బౌల‌ర్ ర‌బ‌డాపై ఒక టెస్ట్ మ్యాచ్ వేటు ప‌డింది. దీంతో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న రెండ‌వ టెస్టుకు ర‌బ‌డా దూరంకానున్నాడు. ఫ‌స్ట్ టెస్ట్ మ్యాచ్ మొద‌టి రోజు బౌలింగ్ చేస్తూ స‌ఫారీ క్రికెట‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. ఘాటైన ప‌ద‌జాలాన్ని వాడాడు. బెన్ స్టోక్స్‌ను ఔట్ చేసిన ర‌బ‌డా అత‌న్ని ప‌రుష‌ప‌ద‌జాలంతో తిట్టాడు. ఇదంతా స్టంప్స్ కెమెరాలో రికార్డు అయ్యింది. అయితే అంపైర్ల ఫిర్యాదు మేర‌కు ఐసీసీ రెఫ‌రీలు బౌల‌ర్‌పై యాక్ష‌న్ తీసుకున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన బౌల‌ర్ ర‌బ‌డాపై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించారు. గ‌తంలోనూ అనేక సార్లు ర‌బ‌డా నోరు జార‌డం వ‌ల్ల అత‌నిపై ఐసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా నియ‌మావ‌ళి ప్ర‌కారం చ‌ర్య తీసుకోవాల్సి వ‌చ్చింది.

1503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles