స్పెయిన్ ఫుట్‌బాల్ కోచ్‌కు ఉద్వాసన

Wed,June 13, 2018 05:06 PM

Julen Lopetegui sacked as Spain coach on eve of World Cup

న్యూఢిల్లీ: మరో 24 గంటల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్-2018 సమరం అంగరంగ వైభవంగా ఆరంభంకానుండగా.. స్పెయిన్ ఫుట్‌బాల్ టీమ్‌లో భారీ అలజడి నెలకొంది. రియల్ మాడ్రిడ్ కోచ్‌గా జులెన్ లోపెటిగ్యూను ప్రకటించిన మరుసటి రోజే జాతీయ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి అతన్ని తప్పిస్తున్నట్లు స్పానిష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియల్స్ బుధవారం ధ్రువీకరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తమ తదుపరి మేనేజర్‌గా లోపెటిగ్యూను నియమిస్తున్నట్లు మంగళవారమే ప్రకటించింది. మరో రెండు రోజుల్లో స్పెయిన్ తన తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌తో తలపడనుంది. రష్యాలో జరుగనున్న ఫిఫా ప్రపంచకప్‌లో బరిలో దిగుతున్న ఫెవరెట్ జట్లలో స్పెయిన్ ఒకటి. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇలాంటి నిర్ణయం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆదేశ ఫుట్‌బాల్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

1372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS