భార‌త్‌తో టీ20 సిరీస్‌కు సఫారీ సారథిగా ఎవరంటే..

Tue,February 13, 2018 04:04 PM

JP Duminy to Lead SA in T20I Seriesకేప్‌టౌన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాతో తలపడే టీ20 జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. సఫారీ జట్టు కెప్టెన్‌గా సీనియర్ ఆటగాడు జేపీ డుమినిని నియమించింది. 14 మంది సభ్యులు గల టీ20 జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లు.. బ్యాట్స్‌మన్ క్రిష్టియన్ జాన్‌కర్, ఫాస్ట్‌బౌలర్ జూనియర్ డాలా, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌లనకు అవకాశం కల్పించింది. గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన డుప్లెసిస్ స్థానంలో డుమిని జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో వన్డేలో పోరాట పటిమ కనబర్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన క్లాసెన్‌ను టీ20లకూ ఎంపికచేశారు. మార్చిలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని సీనియర్, రెగ్యులర్ ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఐతే టీ20 జట్టులో స్టార్ ఆటగాడు డివిలియర్స్ ఉన్నప్పటికీ డుమినికి బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

2227
Follow us on : Facebook | Twitter
Tags
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS