జో రూట్‌కే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు

Tue,February 14, 2017 07:25 AM

Joe Root appointed England Test captain

లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. గతంలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన యార్క్‌షైర్ బ్యాట్స్‌మన్ జో రూట్ టెస్టు జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ మేరకు జో రూట్ నియామకాన్ని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రాజీనామా చేసిన అలిస్టర్ కుక్ స్థానంలో జో రూట్ టెస్టు పగ్గాలు చేపట్టాడని ఈసీబీ తెలిపింది. వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వ్యవహరిస్తాడు.

2586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles