10 పరుగులకే 8 వికెట్లు.. కొత్త వరల్డ్ రికార్డ్

Thu,September 20, 2018 02:38 PM

Jharkhand Spinner Shahbaz Nadeem creates new world record in List A cricket

న్యూఢిల్లీ: జార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ గురువారం ఓ రెండు దశాబ్దాల కిందటి వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నదీమ్ నమోదు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో కేవలం పది పరుగులకే 8 వికెట్లు తీసుకున్నాడు. దీంతో రాజస్థాన్ 28.3 ఓవర్లలో కేవలం 73 పరుగులకు కుప్పకూలింది. నదీమ్ పది ఓవర్లలో పది పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. అందులో నాలుగు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. ఇంతకుముందు రికార్డు కూడా ఓ ఇండియన్ లెఫ్టామ్ స్పిన్నర్ పేరు మీదే ఉండటం విశేషం.

1997లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ సంఘ్వి 15 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. రాహుల్ సంఘ్వి ఇండియా తరఫున 2001లో కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. షాబాజ్ నదీమ్ 99 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 375 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. లిస్ట్ ఎ లెవల్లో 87 మ్యాచుల్లో 124 వికెట్లు తీసుకున్నాడు. జార్ఖండ్ తరఫున నిలకడగా ఆడుతున్న నదీమ్.. టీమిండియాలో స్థానం ఆశిస్తున్నాడు. ఈ మధ్యే ఇంగ్లండ్‌కు వెళ్లిన ఇండియా ఎ టీమ్‌లో నదీమ్ సభ్యుడిగా ఉన్నాడు.

7681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles