ఇటు పంత్.. అటు రాయ్

Sun,June 30, 2019 03:33 PM

Jason Roy gets going, England make brisk start

బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. రెండు జట్లు తమ తుదిజట్లలో మార్పులు చేశాయి. గాయం నుంచి కోలుకున్న ఇంగ్లాండ్ హార్డ్‌హిట్టర్ జేసన్ రాయ్ అందుబాటులోకి వచ్చాడు. జేమ్స్ విన్స్, మొయిన్ అలీ స్థానంలో జేసన్‌రాయ్, లియామ్ ఫ్లంకెట్‌ను తీసుకున్నట్లు మోర్గాన్ తెలిపాడు. కీల‌క స‌మ‌రంలో ఇంగ్లాండ్ ఆశ‌ల‌న్నీ రాయ్‌పైనే.

వరల్డ్‌కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిరాశపరిచాడు. అతడిని తుది జట్టులో ఆడిస్తుండటంపై కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో స్థానంలో యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ వైపు టీమ్‌మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొని పంత్ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది.


3631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles