జేస‌న్ రాయ్‌కు జ‌రిమానా

Fri,July 12, 2019 12:19 PM

Jason Roy fined 30 percent of his match fee

హైద‌రాబాద్‌: ఇంగ్లండ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత వేసింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండ‌వ సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ ఔట్ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డాన్ని రాయ్ త‌ప్పుప‌ట్టాడు. ఆ త‌ర్వాత అంపైర్ ధ‌ర్మ‌సేన‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి చ‌ర్య తీసుకున్న‌ది. ఐసీసీ నియ‌మావ‌ళిని ఆర్టిక‌ల్ 2.8 ఉల్లంఘ‌న ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకున్నారు. జ‌రిమానాతో పాటు రాయ్ ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు క‌లిశాయి. 224 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు రాయ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అయితే ప్యాట్ క‌మ్మిన్స్ వేసిన మ్యాచ్ 20వ ఓవ‌ర్‌లో రాయ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. టీవీ రిప్లేలో మాత్రం బంతి.. బ్యాట్‌కు తాక‌లేద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. కానీ అంపైర్ మాత్రం రాయ్‌ను ఔట్ చేస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించాడు. ఆ స‌మ‌యంలో అంపైర్‌తో రాయ్ వాగ్వాదానికి దిగాడు. అర్ధశతకానికి 50 బంతులు తీసుకున్న రాయ్ ఆ తర్వాత 15 బంతుల్లోనే 35 పరుగులు చేయడం విశేషం. రాయ్ ఔటైన త‌ర్వాత మోర్గ‌న్‌, రూట్‌లు ఇంగ్లండ్‌ను ఫైన‌ల్‌కు చేర్చారు.

2914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles