క్రికెట్‌లో ఇలా ఔట‌వ్వ‌డం మొద‌టిసారి.. వీడియో

Sat,June 24, 2017 10:49 AM

Jason Roy becomes first man ever to be dismissed for obstructing field in T20Is

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండ‌వ టీ20లో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ జేస‌న్ రాయ్ గ‌మ్మ‌త్తుగా ఔట‌య్యాడు. ఫీల్డింగ్‌ను అడ్డుకున్నందుకు అత‌న్ని అంపైర్లు ఔట్‌గా డిక్లేర్ చేశారు. 175 ర‌న్స్ ఛేజ్ చేస్తున్న ఇంగ్లండ్ జోరుమీదున‌న్న‌ది. 67 ర‌న్స్ వ్య‌క్తిగ‌త స్కోర్‌తో రాయ్ దూకుడుమీదున్నాడు. అయితే 16వ ఓవ‌ర్‌లో ఓ సంఘ‌ట‌న మ్యాచ్‌ను మ‌లుపు తిప్పింది. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌ బ్యాటింగ్ చేస్తున్నాడు. నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో రాయ్ ఉన్నాడు. అయితే నాన్ స్ట్ర‌యిక‌ర్ ఎండ్ నుంచి రాయ్ ప‌రుగు కోసం ముందుకు ఉరికాడు. కానీ లివింగ్‌స్టోన్ అత‌న్ని వెన‌క్కి పంపించాడు. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ వెన‌క్కి ప‌రిగెత్తిన రాయ్ బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్ నుంచి ఫెహ‌లుక్‌వ‌యో వేసిన‌ త్రోను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాడు. సౌతాఫ్రికా ప్లేయ‌ర్ ఫెహ‌లుక్‌వ‌యో వేసిన త్రో నేరుగా వికెట్ల దిశ‌గా దూసుకెళ్లింది. కానీ ర‌న్ కోసం వెళ్లి మ‌ధ్య‌లోనే వెనుదిరిగిన రాయ్ వికెట్ల వైపు దూసుకొస్తున్న బంతిని త‌న కాలుతో అడ్డుకున్నాడు. ఈ ద‌శ‌లో బౌల‌ర్ అంపైర్‌కు అపీల్ చేశాడు. మొద‌ట గ్రౌండ్ అంపైర్లు ఆ బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్ర‌క‌టించారు. ఫీల్డింగ్ అడ్డుకున్న జాయ్‌ను ఔట్ చేయాలంటూ బౌల‌ర్ మోరిస్ అపీల్‌కు వెళ్లాడు. దీంతో ఈ స‌మ‌స్య‌ను థార్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు. అయితే చాలా స‌మయం తీసుకున్న థార్డ్ అంపైర్‌ రాయ్ ఔటైన‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇక ఆ త‌ర్వాత ఇంగ్లండ్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. రెండ‌వ టీ20లో సౌతాఫ్రికా మూడు ర‌న్స్ తేడాతో విజ‌యం సాధించింది. కానీ టీ20ల్లో ఫీల్డ‌ర్‌ను అడ్డుకున్నందుకు ఔటైన తొలి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్‌గా రాయ్ నిలిచాడు.


5944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles