అరంగేట్ర టెస్టులోనే ఆర్ధశతకం

Sun,September 9, 2018 05:01 PM

 Jadeja, Vihari take India past 200

లండన్: ఇంగ్లాండ్‌తో ఆఖరిదైన ఐదో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఆదుకుంటున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 174/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ఆదివారం, మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటోంది. క్రమశిక్షణ, పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్న జడేజా, విహరీ భారత్ స్కోరును 200 దాటించారు. క్రీజులో పాతుకుపోయిన విహారి ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ బౌలర్లపై విజృంబిస్తున్నాడు.

ఈ క్రమంలోనే అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే హనుమ విహారి(50 నాటౌట్: 104 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) అర్ధశతకంతో చెలరేగి ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో విలువైన పరుగులు చేసిన తెలుగు కుర్రాడు విహారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న జడేజా(28) సహకారం అందిస్తున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లు ఆడిన టీమ్‌ఇండియా 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.

8448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles