శ‌భాష్ జ‌డేజా.. 39 బంతుల్లో హాఫ్‌సెంచ‌రీ

Wed,July 10, 2019 06:48 PM

Jadeja Hits Fighting 50

మాంచెస్ట‌ర్: ప్ర‌పంచ‌క‌ప్ తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో పోరులో భార‌త్ ల‌క్ష్యానికి చేరువ‌గా దూసుకెళ్తోంది. ఆశ‌లు స‌న్న‌గిల్లిన స‌మ‌యంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా స్ఫూర్తిదాయ‌క ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ కేవ‌లం 39 బంతుల్లోనే 3ఫోర్లు, 3సిక్స‌ర్ల‌తో విజృంభించి 50 మార్క్ అందుకున్నాడు. మ‌రో ఎండ్‌లో మ‌హేంద్ర‌సింగ్ ధోనీ నిదానంగా ఆడుతూ జ‌డ్డూకి మ‌ద్ద‌తునిస్తుండ‌టంతో భార‌త్ ఇన్నింగ్స్ గాడిలో ప‌డింది. జ‌డేజా భారీ షాట్ల‌తో విరుచుకుప‌డుతూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగుతున్నాడు. 42 ఓవ‌ర్ల‌కు భార‌త్ 6 వికెట్ల‌కు ప‌రుగులు చేసింది. జ‌డేజా(54), ధోనీ(29) క్రీజులో ఉన్నారు. భార‌త్ విజ‌యానికి ఇంకా 42 బంతుల్లో 69 ర‌న్స్ చేయాల్సి ఉంది.






4179
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles