లంచ్ బ్రేక్.. ఇంగ్లాండ్ 68/1

Fri,September 7, 2018 06:22 PM

Jadeja gets breakthrough but Cook focussed

లండన్:భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ శుక్రవారం తొలి రోజు ఆటలో లంచ్ విరామ సమాయానికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. ఓపెనర్ అలిస్టర్ కుక్(37), మొయిన్ అలీ(2) క్రీజులో ఉన్నారు. 24వ ఓవర్ తొలి బంతికే స్పిన్నర్ రవీంద్ర జడేజా.. ఓపెనర్ బ్యాట్స్‌మన్ జెన్నింగ్స్(23)ను పెవిలియన్ పంపి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడగొట్టి ఆకట్టుకున్నాడు. వికెట్ కోల్పోయినప్పటికీ కుక్ పట్టుదలగా ఆడుతున్నాడు. చివరి టెస్టు మ్యాచ్ కావడంతో భావోద్వేగంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆందోళనకు గురికాకుండా భారత్ బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు చేస్తున్నాడు. పిచ్ నుంచి సహకారం లభించకపోవడంతో వికెట్లు పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

2711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles