నోఫ్లై జోన్‌గా లార్డ్స్‌ వేదిక

Sat,July 13, 2019 05:08 PM

Its a no fly zone at Lords Cricket Ground

లండన్: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంపై నుంచి రెండు రోజుల పాటు విమానాల రాకపోకలను నిలిపివేయనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను నోైఫ్లెజోన్‌గా ప్రకటించారని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించింది. ఇటీవల ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఛార్టెడ్ విమానాలు వివాదాస్ప‌ద‌ సందేశాలతో కూడిన బ్యానర్లతో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ముందస్తుగానే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరిగే ఆదివారం(14)తో పాటు రిజర్వ్‌డే సోమవారం(15) కూడా నోఫ్లైజోన్‌గా ప్రకటించాలని సంబంధిత అధికారులకు ఐసీసీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం మ‌ధ్యాహ్నం లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ పోరు ఆరంభంకానుంది. ఈ రెండు జట్లలో తొలిసారి కప్పుకొట్టి విశ్వవిజేతగా నిలిచేదేవరో తేలాలంటే ఫైనల్ ఫైట్ వరకు వేచి చూడాల్సిందే.

1048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles