అదో పెద్ద పెంట న్యూస్.. నేనేం మాట్లాడను!

Tue,September 4, 2018 12:40 PM

లండన్: భారత క్రికెట్ అభిమానులకు ఆసక్తి కలిగించే వార్త ఒకటి సోమవారం తెగ చెక్కర్లు కొట్టింది. అదేంటంటే.. టీమిండియా కోచ్ రవిశాస్త్రి మరోసారి ప్రేమలో పడ్డాడు.. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో డేటింగ్ చేస్తున్నాడు అని. రవి గతం తెలిసిన వాళ్లు పెద్దగా ఆశ్చర్యపోలేదు. క్రికెట్ ఆడే రోజుల్లోనూ అతనికి ప్లేబోయ్ ఇమేజే ఉంది. అప్పట్లోనే బాలీవుడ్ నటి అమృతాసింగ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. తర్వాత ఆమెకు గుడ్‌బై చెప్పి రీతూని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల నుంచి ఆమెకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు 56 ఏళ్ల వయసులో మరో లవ్‌స్టోరీని అతడు స్టార్ట్ చేశాడని తెలియగానే.. ఇందులో వింతేముంది అన్నట్లు కొందరు మాట్లాడారు. బాలీవుడ్ మూవీ ఎయిర్‌లిఫ్ట్‌ ఫేమ్ అయిన నిమ్రత్ కౌర్ అతని కంటే 20 ఏళ్లు చిన్నది.

వీళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఓ న్యూస్‌పేపర్ స్టోరీ రాయడంతో విషయం బయటకు తెలిసింది. ఇది క్రమంగా మొత్తం మీడియా అంతా పాకింది. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న రవిశాస్త్రిని మిడ్ డే ఇదే విషయమై ప్రశ్నించింది. మీ డేటింగ్ వార్తలపై స్పందిస్తారా అని అడిగితే.. అదో పెద్ద పెంట న్యూస్.. దానిపై చెప్పడానికి ఏమీ లేదు అంటూ రవి సీరియస్‌గా వెళ్లిపోయాడు. అటు నిమ్రత్ కౌర్ కూడా ఈ వార్తలను ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని ఆమె సోమవారమే ట్వీట్ చేసింది.


3648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles