నాలుగుసార్లు చాంపియన్.. వరల్డ్‌కప్‌కూ క్వాలిఫై కాలేదు!Tue,November 14, 2017 12:45 PM

నాలుగుసార్లు చాంపియన్.. వరల్డ్‌కప్‌కూ క్వాలిఫై కాలేదు!

మిలాన్: ఇటలీకి ఘోర అవమానం. నాలుగుసార్లు విశ్వ విజేత అయిన ఆ టీమ్.. ఈసారి కనీసం ప్రపంచకప్‌కు క్వాలిఫై కూడా కాలేదు. ఇటలీకి ఇలా జరగడం 1958 తర్వాత ఇదే తొలిసారి. స్వీడన్‌తో జరిగిన చివరి ప్లే ఆఫ్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకోవడంతో ఇటలీ క్వాలిఫై కాలేకపోయింది. తొలి లెగ్‌లో ఇటలీపై ఒక మ్యాచ్‌లో గెలిచిన స్వీడన్ వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది. 2006 తర్వాత వరల్డ్‌కప్‌లో ఆడటం స్వీడన్‌కు ఇదే తొలిసారి. తొలిసారి 1934లో విశ్వ విజేతగా నిలిచిన ఇటలీ.. ఆ తర్వాత 1938, 1982, 2006లలో ప్రపంచ చాంపియన్ అయింది. క్వాలిఫై అవ్వాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చాలా వరకు బాల్‌పై ఇటలీ ఆధిపత్యం ప్రదర్శించినా.. గోల్ చేయడంలో మాత్రం విఫలమైంది. ఈ ఓటమితో 39 ఏళ్ల చాంపియన్ గోల్ కీపర్ గియాన్‌లూగి బఫన్ కెరీర్ కూడా ముగిసింది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌తో వీడ్కోలు పలుకుతానని ఇంతకుముందే బఫన్ ప్రకటించాడు. అయితే అతనికి ఆరో వరల్డ్‌కప్ ఆడే అవకాశం దక్కలేదు. ఇటలీ తరఫున 175 మ్యాచుల్లో బఫన్ ప్రాతినిధ్యం వహించాడు. 2006లో వరల్డ్‌కప్ గెలిచిన ఇటలీ టీమ్‌లోనూ బఫన్ సభ్యుడిగా ఉన్నాడు.

3022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS