ఆ ఘనత అందుకున్న మూడో ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మనే

Fri,June 15, 2018 05:02 PM

Ishant Sharma goes past Javagal Srinath

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. టెస్టు కెరీర్‌లో వంద వికెట్ల మార్క్‌ను ఉమేశ్ యాదవ్ చేరుకోగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్న ఆరడుగుల బౌలర్ ఇషాంత్ శర్మ కూడా గొప్ప ఘనత అందుకున్నాడు.

భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా ఇషాంత్(237) నిలిచాడు. ప్రముఖ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ 236 టెస్టు వికెట్ల రికార్డును తాజాగా శర్మ అధిగమించాడు. జాబితాలో ఇషాంత్ కన్నా ముందు కపిల్ దేవ్(434), జహీర్ ఖాన్(311) ఉన్నారు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 ఓవర్లు మాత్రమే వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక బ్యాట్స్‌మన్ రహ్మత్ షాను పెవిలియన్ పంపి సత్తాచాటాడు.

2949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS