ఇండియా విక్ట‌రీపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన షోయెబ్ అక్త‌ర్‌

Thu,June 6, 2019 10:17 AM

Is India manipulating World Cup pitches to win matches? this is what Shoaib Akhtar feels

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రుగుతున్న ఇంగ్లండ్‌లో.. భార‌త్ త‌న‌కు అనుకూలంగా పిచ్‌ల‌ను త‌యారు చేసుకున్న‌దా ? అందుకే అంత ఈజీగా సౌతాఫ్రికాతో కోహ్లీ సేన నెగ్గిందా ? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు వ్య‌క్తం అవుతున్నాయి. పిచ్‌ల‌ను త‌న‌కు అనుకూలంగా త‌యారు చేసుకోవ‌డం వ‌ల్లే సౌతాంప్ట‌న్ లో ఇండియా నెగ్గింద‌న్న అభిప్రాయాల‌ను కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఐసీసీతో బీసీసీఐకి ఉన్న లింకు కార‌ణంగా ఇలా జ‌రిగి ఉంటుంద‌ని కొంద‌రంటున్నారు. ఇలాంటి అపోహ‌ల‌పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయెబ్ అక్త‌ర్ స్పందించారు. అద్భుత‌మైన క్రికెట్ ఆడ‌డం వ‌ల్లే స‌ఫారీల‌పై హిందుస్తాన్ నెగ్గింద‌ని అక్త‌ర్ అన్నారు. ఓ వీడియో ద్వారా త‌న సందేశాన్ని వినిపించారు. ఐసీసీకి 80 శాతం ఫండింగ్ బీసీసీఐ నుంచే జ‌రుగుతుంద‌న్న విష‌యం వాస్త‌వ‌మే అయినా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇండియా అద్భుత ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రిచింద‌న్నారు. ఇంగ్లండ్‌లో గ్రౌండ్‌ను త‌యారు చేసే సిబ్బంది ఎవ‌రి మాట వినిపించుకోర‌ని, స్వంత టీమ్‌ను కూడా వాళ్లు ప‌ట్టించుకోర‌ని, గ్రౌండ్స్‌మెన్ వాళ్ల‌కు న‌చ్చిన‌ట్లుగా పిచ్‌ల‌ను త‌యారు చేస్తార‌ని అక్త‌ర్ అన్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇండియా టాస్ కూడా గెల‌వ‌లేద‌ని, ఒక‌వేళ స‌ఫారీలు మంచిగా ఆడితే 280 స్కోర్ అయ్యేద‌న్నారు. సౌతాఫ్రికాకు ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, కెప్టెన్సీ సంక్షోభం కూడా ఉంద‌న్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన ప్లేయ‌ర్లు ఉండ‌డం వ‌ల్లే ఇండియా గెలిచింద‌న్నారు. బుమ్రా, చాహెల్‌ను ప్ర‌త్య‌ర్థిపై వ‌త్తిడి తేవ‌డంలో స‌ఫ‌ల‌మైన‌ట్లు చెప్పారు. కేఎల్ రాహుల్‌పై వ‌త్తిడి తీసుకురావ‌ద్ద‌న్నారు.

5482
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles