గెలిస్తే సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి

Tue,April 30, 2019 05:31 PM

IPL2019 RCB vs RR match 49 preview RCB, RR desperate for win

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ రాత్రి 8 గంటలకు మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్-12 సీజన్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. అద్భుతాలు జరిగితే తప్ప బెంగళూరు ప్లేఆఫ్స్ చేరే అవకాశం లేదు. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న రాజస్థాన్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో తప్పకుండా విజయం సాధించాలి. త‌దుప‌రి మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజ‌యాలు సాధిస్తేనే నెట్‌ర‌న్‌రేట్ మెరుగుప‌డుతుంది. ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా విదేశీ ఆటగాళ్లు జోఫ్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ జట్టును వీడారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లతే అనూహ్య ప్రదర్శన చేస్తేనే రాజస్థాన్ రేసులో నిలిచేది. నెట్‌ర‌న్‌రేట్‌లో వెనకబడ్డ రాజస్థాన్ తన ఆఖరి రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థి వేదికలపై ఆడనుంది. రాజ‌స్థాన్ ప్లేఆఫ్స్ అవ‌కాశాలు మిగ‌తా జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంది.మరోవైపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ సీజన్‌ను ఘనంగా ముగించాలని కోహ్లీసేన భావిస్తోంది. సాంకేతికంగా ఆ జట్టు ఇంకా రేసులోనే ఉంది. 6 విజయాలతో ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఆర్‌సీబీలో విరాట్, ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్ ఫామ్‌లో ఉండగా.. రాజస్థాన్ టీమ్‌లో రహానె, సంజు శాంసన్ గొప్పగా రాణిస్తున్నారు. రెండు జట్లలో స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్(ఆర్‌సీబీ), శ్రేయాస్ గోపాల్(ఆర్‌ఆర్) తమ స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌లను మలుపుతిప్పనున్నారు. కెప్టెన్ స్టీవ్‌స్మిత్ రాజస్థాన్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు.

5441
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles