నాలుగోస్థానం రేసులో నలుగురు.. ఐపీఎల్‌ను బట్టే టీమ్ ఎంపిక!

Tue,March 19, 2019 01:53 PM

IPL will be crucial for selection of World Cup squad says BCCI

ముంబై: వరల్డ్‌కప్ టీమ్ ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోమని ఇంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పాడు. కానీ బీసీసీఐ ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఇప్పటికే నాలుగో స్థానంలో కుదురుగా ఆడే బ్యాట్స్‌మన్ దొరక్కపోవడంతో ఐపీఎల్ ప్రదర్శనను బట్టే వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక ఉంటుందని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఏప్రిల్ 20 సమయంలో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ తొలి నెల కీలకం కానుంది. ఇందులో బాగా రాణించిన వాళ్లకు వరల్డ్‌కప్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనే అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించినా.. నాలుగో స్థానంలో మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో ఎవరూ రాణించలేదు. ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అజింక్య రహానే, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఈ స్థానం కోసం పోటీలో ఉన్నారు.

వీళ్లు ఐపీఎల్‌లో ఎలా రాణిస్తారన్నదానిని బట్టి వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక ఆధారపడి ఉంది. నాలుగో స్థానానికి ఇంకా ఏ ప్లేయర్ ఖరారు కాలేదు. ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది. గతేడాది కొంత మంది ప్లేయర్స్ ఈ స్థానంలో కుదురుకుంటారని భావించినా అలా జరగలేదు. దీంతో తొలి నెల ఐపీఎల్‌లో రాణించిన ప్లేయర్‌కు ఈ స్థానం దక్కే అవకాశం ఉంది అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. నిజానికి కోహ్లిని నంబర్ 4లో పంపాలని కోచ్ రవిశాస్త్రి ప్రతిపాదించినా.. అది మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అతడు నాలుగో స్థానానికే పరిమితం కాడు అని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. రహానే, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ వరల్డ్‌కప్ టీమ్‌లో తమకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తే నంబర్ 4 తమదే అని ఈ ఇద్దరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వరల్డ్‌కప్ టీమ్ గురించి తాను ఆలోచించడం లేదని, అయితే ఐపీఎల్‌లో రాణిస్తే టీమ్‌లో చోటు అదే దక్కుతుందని రహానే అన్నాడు. ఐపీఎల్ మొదట్లోనే రాణిస్తే అది సెలక్టర్లను ప్రభావితం చేస్తుందని అటు శ్రేయస్ అయ్యర్ కూడా అభిప్రాయపడ్డాడు.

3678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles